×
Image

అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం - (తెలుగు)

ఈ పుస్తకం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర గురించి మరియు ఆయన మహోన్నతమైన గుణగణాల గురించి చర్చించినది. పాశ్చాత్య సమాజంలోని అనేక మంది ప్రముఖులు ఆయన గురించి వెలుబుచ్చిన అభిప్రాయాలను కూడా మన ముందుకు తీసుకు వచ్చింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ చదవ వలసిన ఒక మంచి పుస్తకమిది.

Image

దివ్యఖుర్ఆన్ సందేశం - (తెలుగు)

ఇది తెలుగు భాషలో ఖుర్ఆన్ భావం యొక్క అనువాదము. మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ఇక్కడ పొందుపరచ బడినది. దీనిని మెరుగుపరచటానికి, మీ సలహాలు ఏమైనా ఉంటే దయచేసి అనువాదకుడికి పంపగలరు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ప్రతి అరబీ వచనమునకు దాని ప్రక్కనే తెలుగు అనువాదం చేయబడినది.

Image

మనమంతా ఒక్కటే – మనందరి దేవుడూ ఒక్కడే - (తెలుగు)

హిందూ, క్రైస్తవ మరియు ఇస్లాం దివ్యగ్రంథాల వెలుగులో దేవుడంటే ఎవరు మరియు ఆదం – హవ్వా ఆదిదంపతుల బిడ్డలమైన మనమందరమూ ఏ విధంగా ఒక్కటవ గలము అనే ముఖ్యవిషయాల్ని, అవతరించిన నాటి నుండి ఎలాంటి కలుషితాలకు లోనుకాకుండా స్వచ్ఛమైన రూపంలో మిగిలిన ఉన్న ఏకైక దివ్యగ్రంథమైన ఖుర్ఆన్ మనందరి కొరకు మన సృష్టికర్త పంపిన అంతిమ సందేశమని, దానిని ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవవలసిన ఆవశ్యకతను గురించి సోదరుడు సిరాజుర్రహ్మాన్....

Image

ఇస్లామీయ ఆరాధనలు - (తెలుగు)

ఈ పుస్తకంలో చర్చించబడిన విషయాలు: అఖీదహ్, మూలవిశ్వాసాలు, తౌహీద్, బహుదైవారాధన, షిర్క్; ఖుర్ఆన్ మరియు సున్నతుల అనుసరణ, శుచీ-శుభ్రత, నమాజు, ప్రార్థనలు, ఉపవాసం, రమదాన్ మాసం, తరావీలు, జకాతు, వారసత్వం, హజ్, ఉమ్రా, పండుగలు, సంతోష సమయాలు – నిఖా, అఖీఖహ్; జనాజ - అంత్యక్రియలు, ఇస్లాం జీవన విధానం - సలాం ఆదేశాలు, తల్లిదండ్రుల హక్కులు, పిల్లల శిక్షణ, రోగుల పరామర్శ, అతిథి మర్యాద, భోజన నియమాలు.

Image

విశ్వాస మూలసూత్రాలు - (తెలుగు)

ఇస్లామీయ మూసవిశ్వాసం మరియు ఏకదైవారాధన గురించి ఈ పుస్తకంలో చర్చించబడినది.

Image

జిహాద్ మరియు ఉగ్రవాదం - (తెలుగు)

ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు జిహాద్ మరియు ఉగ్రవాదం గురించి వివరంగా చర్చించారు.

Image

ఇస్లామిక్ స్టడీస్ డిప్లొమా పాఠాలు, విద్యాశాఖ, తెలుభాషా విభాగం, రబ్వహ్ ఇస్లామీయ కేంద్రం, రబ్వహ్, రియాద్ - (తెలుగు)

ఇస్లామిక్ స్టడీస్ డిప్లొమా కోర్సు, విద్యాశాఖ, తెలుగు భాషా విభాగం, రబ్వహ్ ఇస్లామీయ కేంద్రం, రబ్వహ్, రియాద్. ఈ కోర్సు 5 సెమిష్టర్లలో దాదాపు రెండున్నర సంవత్సరాల లోపు పూర్తి అవుతుంది. ఒక్కో సెమిష్టరు నాలుగు నెలలు. ముస్లింలకు మరియు నవ ముస్లింలకు అవసరమైన ప్రాథమిక ఇస్లామీయ సబ్జెక్టులు ఇక్కడ ప్రామాణిక ఆధారాలతో బోధించ బడును. వీటిలో కొన్ని - బేసిక్ అరబీ భాష, ఖుర్ఆన్, అత్తౌహీద్ (ఏక దైవత్వం),....

Image

తౌహీద్ – దేవుని ఏకత్వం - (తెలుగు)

ఇస్లామీయ ఏకదైవత్వం గురించి ప్రచురించబడిన మంచి పుస్తకాలలో ఒకటి. దీనిలో ప్రతి మానవుడు తన సృష్టికర్త గురించి తెలుసుకోవలసిన అనేక విషయాలు స్పష్టంగా తెలుపబడినాయి. అంతేగాక కొందరు ప్రజలలో కనబడే అవిశ్వాసం, కపటత్వం మరియు నూతన కల్పితాల గురించి కూడా స్పష్టంగా వివరించబడింది.

Image

చిత్తశుద్ధితో చేసిన పుణ్యంబు ……. - (తెలుగు)

ఈ వ్యాసంలో అంతిమ తీర్పు దినాన పనికి వచ్చే చిత్తశుద్ధితో కూడిన కొన్ని పుణ్యకార్యాల గురించి క్లుప్తంగా వివరించబడింది.

Image

పటిష్ఠమైన ఈమాన్ - (తెలుగు)

ఇస్లామీయ జీవిత విధానాన్ని అనుసరించడంలో మనం కలిగి ఉండవలసిన పటిష్ఠమైన ఈమాన్ గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

Image

మతవిశ్వాసపు ప్రకటన (షహాదా) షరతులు - నిబంధనలు - (తెలుగు)

ఇస్లాం ధర్మవిశ్వాసపు ప్రకటన యొక్క 9 షరతులు

Image

అల్ కుఫ్ర్ - అవిశ్వాసం - (తెలుగు)

అల్ కుఫ్ర్ అంటే అవిశ్వాసం యొక్క నిర్వచనం మరియు దాని యొక్క భాగాల గురించి ఈ వ్యాసంలో క్లుప్తంగా చర్చించబడినది.