మర్కజ్ దారుల్ బిర్ర్ అధ్యాపకులైన జనాబ్ ముహమ్మద్ అమీన్ ఉమ్రీ గారి వ్యాసాన్ని అక్కడి విద్యార్థిని షఫిఆ అహ్మదియా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో విశ్వాస మూలస్థంభాల గురించి స్పష్టంగా, క్లుప్తంగా వివరించబడినది.
ఈమాన్ మూల స్థంభాలు - (తెలుగు)
దైవదౌత్యంపై విశ్వాసం - (తెలుగు)
మర్కజ్ దారుల్ బిర్ర్ అధ్యాపకులైన జనాబ్ ముహమ్మద్ ఇనాముల్లాహ్ ఉమ్రీ గారి వ్యాసాన్ని అక్కడి విద్యార్థిని నఫీసా అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో ప్రవక్త అంటే ఎవరు, రసూల్ అంటే ఎవరు, ప్రవక్తల ప్రత్యేకతల గురించి, అంతిమ ప్రవక్త మరియు సందేశహరుడి విశ్వసించవలసిన ఆవశ్యకత గురించి స్పష్టంగా, క్లుప్తంగా వివరించబడినది.
దైవదౌత్య పరిసమాప్తి - (తెలుగు)
మర్కజ్ దారుల్ బిర్ర్ అధ్యాపకులైన జనాబ్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఉమ్రీ గారి వ్యాసాన్ని అక్కడి విద్యార్థిని హనీఫా అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత మరో ప్రవక్త వచ్చే అవకాశం ఎందుకు లేదో తగిన ప్రామాణిక ఆధారాలతో స్పష్టంగా, చక్కగా వివరించారు.
లా ఇలాహ ఇల్లల్లాహ్ - (తెలుగు)
ఈ చిరు వ్యాసంలో మర్కజ్ దారుల్ బిర్ర్ అధ్యాపకులైన జనాబ్ అబ్దుష్షుకుర్ ఉమ్రీ గారు చాలా చక్కగా లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు తౌహీద్ గురించి వివరించారు. అంతేగాక సున్నతు మరియు బిదాఅత్ ల గురించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి, ఆయనను అంతిమ ప్రవక్త మరియు సందేశహరుడిగా ఎందుకు విశ్వసించాలనే ముఖ్యాంశం గురించి కూడా స్పష్టంగా, క్లుప్తంగా వివరించారు.
ఖాదియానియత్ - (తెలుగు)
డా. సయీద్ అహ్మద్ ఉమ్రీ మదనీ గారు ఈ పుస్తకంలో పరస్పరం విభేదిస్తున్న అసత్య పలుకులతో, ప్రజలను అయోమయంలో పడవేసి, తప్పుడు దారి పట్టిస్తున్న ఖాదియానియత్ గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా క్షుణ్ణంగా చర్చించారు. సత్యం తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు తప్పకుండా చదవ వలసిన మంచి రిసెర్చ్ పుస్తకమిది.
సూరతుల్ ఫాతిహా వ్యాఖ్యానం - (తెలుగు)
అంతిమ దైవగ్రంథం ఖుర్ఆన్ (అహసనుల్ బయాన్) నుండి సూరతుల్ ఫాతిహా అనువాదం మరియు వ్యాఖ్యానం.
అహ్లుస్ సున్నత్ వల్ జమాఅత్ అంటే ఎవరు ? - (తెలుగు)
ఈ పుస్తకంలో సహాబాల కాలంలోని అహ్లుస్ సున్నత్ వల్ జమాఅత్, ఔలియా అల్లాహ్ అంటే ఎవరు, షైతాను ఔలియాల గురించి, నాలుగు ఇమాములు గురించి, తఖ్లీద్ వాస్తవికత, వహాబీల వాస్తవికత, వహాబీ అనే బిరుదు ఎందుకు వచ్చింది, ఇస్లాంలో బయలుదేరిన నూతన వర్గాలు, సూఫీలు, మార్గభ్రష్టులు, తబ్ లీగ్ జమాఅతు, గులూ, మొదలైన విభిన్న విషయాల గురించి వివరంగా చర్చించడం జరిగింది.
జీసస్ (అలైహిస్సలాం) : అల్లాహ్ యొక్క ప్రవక్త - (తెలుగు)
ఈ వ్యాసంలో ప్రవక్త జీసస్ అలైహిస్సలాం గురించి ప్రామాణిక సాక్ష్యాధారలతో చక్కగా వివరించారు. దీని ద్వారా నిష్పక్షపాతంగా చదివే పాఠకులకు చాలా సులభంగా అసలు జీసస్ అలైహిస్సలాం ఎవరు అనే సత్యం తెలిసి పోతుంది. ఇది ఇస్లామిక్ పాంప్లెట్స్ అనే సంస్థ ఇంగ్లీషులో తయారు చేసిన ఒక కరపత్రం యొక్క తెలుగు అనువాదం.
మన జీవిత ఉద్దేశ్యం ఏమిటి ? - (తెలుగు)
ఈ వ్యాసంలో మన జీవిత అసలు ఉద్దేశ్యం ఏమిటి అనే అంశం గురించి ఇస్లామీయ బోధనలు మరియు లాజికల్ విషయాల ఆధారంగా చర్చించబడింది. దీని ద్వారా నిష్పక్షపాతంగా చదివే పాఠకులు చాలా సులభంగా తమ జీవన ఉద్దేశ్యం గురించి గ్రహించి, ఇస్లాం ధర్మం స్వీకరించే అవకాశం ఉన్నది. ఇది ఇస్లామిక్ పాంప్లెట్స్ అనే సంస్థ ఇంగ్లీషులో తయారు చేసిన ఒక కరపత్రం యొక్క తెలుగు అనువాదం.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం - (తెలుగు)
ఈ వ్యాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రామాణిక సాక్ష్యాధారలతో చక్కగా వివరించారు. దీని ద్వారా నిష్పక్షపాతంగా చదివే పాఠకులకు చాలా సులభంగా అసలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు అనే సత్యం తెలిసి పోతుంది. ఇది ఇస్లామిక్ పాంప్లెట్స్ అనే సంస్థ ఇంగ్లీషులో తయారు చేసిన ఒక కరపత్రం యొక్క తెలుగు అనువాదం.
ఇస్లాం ధర్మం యొక్క ఐదు మూలస్థంభాలు - (తెలుగు)
ఇస్లాం ధర్మం యొక్క ఐదు మూలస్థంభాలైన షహాదహ్, నమాజు, జకాతు, ఉపవాసం మరియు హజ్ ల గురించి ఇక్కడ చక్కగా వివరించబడింది.
తౌహీద్ – దేవుని ఏకత్వం - (తెలుగు)
ఇస్లామీయ ఏకదైవత్వం గురించి ప్రచురించబడిన మంచి పుస్తకాలలో ఒకటి. దీనిలో ప్రతి మానవుడు తన సృష్టికర్త గురించి తెలుసుకోవలసిన అనేక విషయాలు స్పష్టంగా తెలుపబడినాయి. అంతేగాక కొందరు ప్రజలలో కనబడే అవిశ్వాసం, కపటత్వం మరియు నూతన కల్పితాల గురించి కూడా స్పష్టంగా వివరించబడింది.

API

