×
మూడు విధాల హజ్జ్ ఆచరణలు సంక్షిప్తంగా

    హజ్ ఆచరణలు

    ﴿ أعمال الحج

    ] తెలుగు – Telugu – تلغو [

    రబ్వహ్ ఇస్లామీయ ప్రచార కేంద్రం.

    అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్

    పునర్విమర్శ : షేక్ రియాజ్ అహ్మద్

    2010 - 1431

    ﴿ أعمال الحج

    « باللغة التلغو »

    الربوة الجاليات

    ترجمة: محمد كريم الله

    مراجعة: شيخ رياض أحمد

    2010 - 1431

    హజ్ ఆచరణలు

    أعمال الحج

    بلغة التلغو

    రబ్వహ్ ఇస్లామీయ ప్రచార కేంద్రం, రియాద్, సౌదీ అరేబియా. telugu@islamhouse.com

    హజ్ మూలస్థంభాలు (అరకాన్):

    1. ఇహ్రాం: ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించే నియ్యత్ (సంకల్పం)

    2. అరఫాత్ లో నిలబడటం.

    3. తవాఫె ఇఫాదహ్ (అరఫహ్ దినం - 10వ తేదీ తరువాత చేసే తవాఫ్)

    4. సయీ: సఫా మరియు మర్వాల మధ్య 7 సార్లు తిరగటం

    ఒకవేళ ఎవరైనా ఈ మూలస్థంభాలలో దేనినైనా ఆచరించలేకపోతే, దానిని పూర్తి చేసే వరకూ వారి హజ్ పూర్తికాదు.

    హజ్ లో ఆచరించవలసిన తప్పని సరి (వాజిబ్) ఆచరణలు:

    1. మీఖాత్ నుండి ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించటం.

    2. సూర్యాస్తమయం వరకు అరఫాత్ మైదానంలో నిలబడటం.

    3. ముజ్దలిఫాహ్ లో రాత్రి గడపటం.

    3. 10వ తేదీ, 11వ తేదీ మరియు వీలయితే 12వ తేదీ (ఐచ్ఛికం, తప్పని సరికాదు) రాత్రులు మీనాలో గడపటం.

    4. జమరాతులపై రాళ్ళు విసరటం.

    5. వీడుకోలు తవాఫ్.

    6. పురుషులు తమ తల వెంట్రుకులు పూర్తిగా గొరిగించుకోవటం లేదా తన వెంట్రుకలన్నీ కత్తిరించుకోవటం.

    ఒకవేళ ఎవరైనా ఈ ఆచరణలలో ఏదైనా చేయలేకపోతే, ప్రాయశ్చితంగా మక్కా పరిధి లోపల ఖుర్బానీ ఇచ్చి, దానిని అక్కడి వారిలో పంచిపెట్టాలి.

    హజ్ లోని ఐచ్ఛికమైన (సునన్) ఆచరణలు:

    1. ఇహ్రాం దుస్తులు ధరించే ముందు స్నానం (గుసుల్) చేయటం.

    2. పురుషులు రెండు తెల్లటి, కుట్టబడని వస్త్రాలు ధరించటం.

    3. తల్బియా (లబ్బైక్ - అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ - లాషరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ ద, వన్నేమత, లకవుల్ ముల్క్, లాషరీక లక్) పలకటం.

    4. మీనాలో 8వ తేదీ రాత్రి గడపటం.

    5. చిన్న మరియు మధ్య జమరాతులపై రాళ్ళు విసిరిన తరువాత, వాటి వాటి కుడివైపున కొంచెం దూరంలో నిలబడి, ఖిబ్లావైపు తిరిగి దుఆ చేయటం.

    6. ఖిరాన్ లేక ఇఫ్రాద్ పద్ధతిలో హజ్ చేస్తున్నవారు తవాఫె ఖుదుమ్ (తొలి తవాఫ్) చేయటం.

    ఒకవేళ వీటిలో ఏదైనా ఆచరించలేక పోతే, ఎలాంటి ప్రాయశ్చితం చేయనక్కర లేదు.

    ఇహ్రాం స్థితిలో ఉన్న వ్యక్తిపై నిషేధింపబడిన విషయాలు:

    1. షేవింగ్ చేయటం, ట్రిమ్ చేయటం, కత్తిరించటం – ఏ వెంట్రుకలైనా సరే.

    2. చేతి వ్రేళ్ళ లేదా కాలి వ్రేళ్ల గోళ్ళు కత్తిరించటం.

    3. తలను స్పర్శించే విధంగా పురుషులు తమ తలపై ఏదైనా కప్పుకోవటం.

    4. పురుషులు కుట్టబడిన దుస్తులు ధరించటం.

    5. ఇహ్రాం దుస్తులపై అత్తరు, సుగంధ ద్రవ్యాలు పూసుకోవటం.

    6. భూమి పై సంచరించే జంతువుల వేట.

    7. భార్యాభర్తల శారీరక సంబంధం- సంభోగం మరియు కామంతో ముద్దులు పెట్టుకోవడం, స్పర్శించడం మొదలైన కామక్రీడలన్నీ నిషేధమే.

    8. వివాహ ఒప్పందం (నిఖా, ఒడంబడిక, ఎంగేజ్మెంటు, పెళ్ళిచూపులు, పెళ్ళి సంప్రదింపులు ... )

    ఇహ్రాం స్థితిలో ఒకవేళ ఎవరైనా తెలియక,మరచి/బలవంతం చేయబడటం వలన పై నిషేధాజ్ఞలలోనుండి ఏదైనా చేస్తే, వారిపై ఎలాంటి ప్రాయశ్చితం లేదు.

    హాదీ (ఖుర్బానీ, పశుబలి):

    · ఖుర్బానీ చేయవలసిన స్థలం: మీనా, మక్కా మరియు మక్కా పరిధిలోపలి హరమ్ ప్రాంతం.

    · పశువుల రకాలు: ఒంటె (కనీస వయస్సు 5 సంవత్సరాలు ఉండాలి) – ఏడుగురి కొరకు.

    · ఆవు (కనీస వయస్సు 2 సంవత్సరాలు ఉండాలి) – ఏడుగురి కొరకు.

    · మేక (కనీస వయస్సు 1 సంవత్సరం ఉండాలి) – ఒక్కరి కొరకు మాత్రమే.

    · గొర్రె (కనీస వయస్సు 1 సంవత్సరం ఉండాలి) – ఒక్కరి కొరకు మాత్రమే.

    ఒకవేళ ఎవరికైనా ఖుర్బానీ చేసే స్థోమత లేకపోతే, హజ్ సమయంలో మూడు దినాలు మరియు ఇంటికి మరలిన తరువాత ఏడు దినాలు ఉపవాసం పాటించవలెను. ఆ ఉపవాసాలు నిరంతరంగా ఒకదాని తరువాత ఒకటి పాటించవచ్చు లేదా వేర్వేరు దినాలలో పాటించవచ్చు.

    హజ్ దినాలలో క్రింది హజ్ పద్ధతులలో ఒక పద్ధతిని అనుసరిస్తూ హాజీ చేయవలసిన హజ్ ఆచరణలలోని ముఖ్యవిషయాల సారాంశం

    హజ్ తేదీ

    ఇఫ్రాద్ పద్ధతి (కేవలం హజ్ నియ్యత్ మాత్రమే)

    ఖిరాన్ పద్దతి (ఉమ్రా మరియు హజ్ లు ఒకే నియ్యత్ - సంకల్పంతో)

    తమత్తు పద్ధతి (ఉమ్రా మరియు హజ్ వేర్వేరుగా)

    8వ తేదీకి ముందు హాజీ చేయ వలసిన పనులు

    · మీఖాత్ వద్ద ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించి, తల్బియా (లబ్బైక్ హజ్జన్) అని ఉచ్ఛరించటం.

    · మీఖాత్ వద్ద ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించి, తల్బియా (లబ్బైక్ ఉమ్రతన్ వ హజ్జతన్) అని ఉచ్ఛరించటం.

    · మీఖాత్ వద్ద ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించి, తల్బియా (లబ్బైక్ ఉమ్రతన్ ముతమత్తిఅన్ బిహా ఇలల్ హజ్) అని ఉచ్ఛరించటం.

    · ఉమ్రా కొరకు తవాఫ్.

    · ఉమ్రా కొరకు సయీ.

    · వెంట్రుకలు పూర్తిగా తీసివేయటం లేదా చిన్నగా కత్తిరించుకోవటం.

    · ఇహ్రాం నుండి బయటపడి, ఇహ్రాంకు పూర్వపు స్థితిలోనికి వాపసు కావటం.

    · తవాఫె ఖుదూమ్ (మక్కా చేరుకున్న తరువాత చేసే మొదటి కాబా ప్రదక్షిణ. ఇది సున్నత్ - ఐచ్ఛికం – తప్పనిసరి కాదు)

    · సయీ (సఫా – మర్వాల మధ్య ఏడు సార్లు తిరగటం) – ఒకవేళ హజ్ యాత్రికుడు తవాఫె ఖుదూమ్ తరువాత సయీ చేయకుండానే నేరుగా మీనాకు వెళ్ళిపోతే, హజ్ తవాఫ్ (తవాఫె ఇఫాదహ్) తరువాత తప్పకుండా దానిని పూర్తి చేయాలి.

    · 10వ తేదీ (ఖుర్బానీ దినం) వరకు ఇహ్రాం స్థితిలోనే ఉండాలి.

    8వ తేదీ

    ప్రస్తుతమున్న ఇహ్రాం స్థితిలోనే మీనాకు బయలు దేరాలి.

    బస చేసిన చోటనే ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించి, మీనాకు బయలుదేరాలి.

    మీనాలో దొహర్, అసర్, మగ్రిబ్, ఇషా & 9వ తేదీ ఫజర్ నమాజులు వాటి వాటి నిర్ణీత సమయంలోనే పూర్తి చేయాలి. అయితే దొహర్, అసర్, ఇషా నమాజుల 4 రకాతులను ఖసర్ చేయాలి అంటే 2 రకాతులకు తగ్గించాలి.

    9వ తేదీ

    · సూర్యోదయం తరువాత, అరఫాత్ వైపునకు బయలుదేరాలి. అరఫాత్ లో దొహర్ నమాజు సమయంలోనే దొహర్ మరియు అసర్ నమాజులు కలిపి, ఒక అదాన్ మరియు రెండు ఇఖామతులతో చేయాలి. ప్రతి నమాజు ఖసర్ చేసి (తగ్గించి) రెండు రకాతులే చేయాలి. తనివితీరా, సాధ్యమైనంత ఎక్కువగా అల్లాహ్ ను వేడుకోవాలి. ‘జబలే రహ్మ’ కొండవైపుకు కాకుండా ఖిబ్లా వైపుకు తిరిగి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసినట్లుగా చేతులు పైకెత్తి, దుఆ చేయాలి. హజ్ యాత్రికుడు అరఫాత్ రోజున ఉపవాసం ఉండకూడదు. అరఫాత్ నది పారే ప్రాంతం అరఫాత్ మైదానం క్రిందికి రాదు. కాబట్టి, అక్కడ నిలుచోరాదు. అంతేకాక ‘జబలే రహ్మ’ కొండపైకి ఎక్కటం, పైన నిలబడి దుఆ చేయటం కూడా సున్నత్ లో లేదు.

    · సూర్యాస్తమయం తరువాత అరఫాత్ మైదానాన్ని వదిలి, ప్రశాంతంగా ముజ్దలిఫా వైపుకు పయనించాలి.

    · ముజ్దలిఫా చేరుకున్న తరువాత, మగ్రిబ్ మరియు ఇషా (రెండు రకాతులు) నమాజులు, ఒకే అదాన్ మరియు రెండు ఇఖామతులతో పూర్తి చేయాలి.

    · జమ్రతుల్ అఖబహ్ అల్ కుబ్ర వద్ద విసరటానికి, యాత్రికుడు ఇక్కడ నుండి 7 కంకర రాళ్ళు ఏరుకోవాలి - మీనా నుండి ఏరుకోవటానికి కూడా అనుమతి ఉన్నది. కంకర రాళ్ళు శనగ పప్పు, బాదం లేదా చిక్కుడు గింజలంత సైజుంటే చాలు.

    · ఆ తరువాత యాత్రికుడు ముజ్దలిఫాలో నిద్రపోయి, మరుసటి ఉదయాన్నే (10వ తేదీన) ఫజర్ నమాజు చేసి, అల్లాహ్ ను వేడుకోవాలి. ‘అల్ మష్ హర్ అల్ హరమ్’ అనే చోట సూర్యోదయం కంటే ముందు బాగా వెలుతురు వచ్చే వరకు నిలబడి, అల్లాహ్ ను ప్రార్థించాలి (దుఆ చేయాలి). నడిరాత్రి దాటిన తరువాత ముజ్దలిఫా వదలటానికి బలహీనులకు (ముసలివారు, మహిళలు, వ్యాధిగ్రస్తులు) అనుమతి ఉన్నది.

    10వ తేదీ

    సూర్యోదయం కంటే ముందే మీనా కొరకు బయలు దేరాలి. జమరతుల్ అఖబహ్ (పెద్ద జమరాతు) పై ఒక్కొక్కటిగా ఏడు కంకర రాళ్ళు విసరాలి. కంకర రాయి విసిరే ప్రతిసారీ ‘అల్లాహ్ అక్బర్’ అని పలుకాలి.

    ఈ పద్ధతిలో ఖుర్బానీ (బలిపశువు) సమర్పించనవసరం లేదు.

    ఖుర్బానీ (బలిపశువు) సమర్పించాలి. మక్కావాసులు ఖుర్బానీ సమర్పించనక్కర లేదు.

    · తల వెంట్రుకలు తల గొరిగించుకోవాలి లేదా తల వెంట్రుకలన్నీ తగ్గించుకోవాలి. తల గొరిగించుకోవటం మంచిది. మహిళలు తమ తల వెంట్రుకలను అంగుళమంత కత్తిరింపజేసుకోవాలి.

    · అత్తహలుల్ అస్గర్ అంటే ఇహ్రాం విడిచి పెట్టి, మామూలు దుస్తులు ధరించాలి. ఇప్పటి వరకు హజ్ యాత్రికునిపై ఏవైతే ఇహ్రాం స్థితి యొక్క నిషేధాజ్ఞలు ఉన్నాయో, అవన్నీ ఇప్పుడు తొలగిపోయాయి – భార్యాభర్తల సంభోగం తప్ప.

    · మక్కా వెళ్ళి, తవాఫె ఇఫాదహ్ చేయాలి. దీనిని 11వ తేదీ లేదా 12వ తేదీ లేదా వీడుకోలు తవాఫ్ వరకు వాయిదా వేసుకోవచ్చు. దీని తరువాత, హజ్ యాత్రికునిపై ఉన్న ఇహ్రాం నిషేధాజ్ఞలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. దీనినే అత్తహలుల్ అక్బర్ అంటారు.

    · ఒకవేళ తవాఫె ఖుదూమ్ తరువాత సయీ చేయకనే మీనాకు వెళ్ళిపోయినట్లయితే, ఇప్పుడు దానిని పూర్తి చేయాలి.

    తవాఫె ఇఫాదహ్ తరువాత సయీ చేయాలి.

    11వ తేదీ

    · మీనాలో 10వ తేదీ రాత్రి గడుప వలెను.

    · మిట్టమధ్యాహ్నం దాటాక, మొదట చిన్న జమరాతుపై ఒక్కొక్కటిగా ఏడు కంకర రాళ్ళు విసిరి, దానికి కుడివైపున కొంచెం దూరంలో నిలబడి, ఖిబ్లా వైపు తిరిగి, అల్లాహ్ ను వేడుకోవాలి. అలాగే మధ్యదానిపై ఒక్కొక్కటిగా ఏడు కంకర రాళ్ళు విసిరి, దానికి కొంచెం దూరంలో, ఖిబ్లా దిశవైపు తిరిగి అల్లాహ్ ను వేడుకోవాలి. చివరిగా జమరతుల్ అఖబహ్ అనే పెద్ద జమరాతుపై ఒక్కొక్కటిగా ఏడు కంకర రాళ్ళు విసరాలి. కానీ ఇక్కడ దుఆ చేయరాదు.

    12వ తేదీ

    · మీనాలో 11వ తేదీ రాత్రి గడుప వలెను.

    · మిట్టమధ్యాహ్నం దాటాక, మొదట చిన్న జమరాతుపై ఒక్కొక్కటిగా ఏడు కంకర రాళ్ళు విసిరి, దానికి కుడివైపున కొంచెం దూరంలో నిలబడి, ఖిబ్లా వైపు తిరిగి, అల్లాహ్ ను వేడుకోవాలి. అలాగే మధ్యదానిపై ఒక్కొక్కటిగా ఏడు కంకర రాళ్ళు విసిరి, దానికి కొంచెం దూరంలో, ఖిబ్లా దిశవైపు తిరిగి అల్లాహ్ ను వేడుకోవాలి. చివరిగా జమరతుల్ అఖబహ్ అనే పెద్ద జమరాతుపై ఒక్కొక్కటిగా ఏడు కంకర రాళ్ళు విసరాలి. కానీ ఇక్కడ దుఆ చేయరాదు. ఈరోజే మీనా వదిలి వెళ్ళటం అనుమతించబడింది. అయితే సూర్యాస్తమయానికి ముందే మీనా వదలి పెట్టాలి. చివరిగా మక్కా వదలటానికి ముందు వీడుకోలు తవాఫ్ చేయాలి.

    13వ తేదీ

    · మీనాలో 12వ తేదీ రాత్రి గడుప వలెను.

    · మిట్టమధ్యాహ్నం దాటాక, మొదట చిన్న జమరాతుపై ఒక్కొక్కటిగా 7 రాళ్ళు విసిరి, దానికి కుడివైపున కొంచెం దూరంలో నిలబడి, ఖిబ్లా వైపు తిరిగి, అల్లాహ్ ను వేడుకోవాలి. అలాగే మధ్యదానిపై ఒక్కొక్కటిగా 7 రాళ్ళు విసిరి, కుడివైపున కొంచెం దూరం లో, ఖిబ్లా దిశవైపు తిరిగి అల్లాహ్ ను వేడుకోవాలి. చివరిగా జమరతుల్ అఖబహ్ పై ఒక్కొక్కటిగా 7 రాళ్ళు విసరాలి. కానీ ఇక్కడ దుఆ చేయరాదు. వీలు చూసుకుని మక్కా చేరుకోవాలి. చివరిగా మక్కా వదలటానికి ముందు వీడుకోలు తవాఫ్ చేయాలి.

    గమనిక: ఋతుస్రావంలో ఉన్న మహిళలు మరియు పురుడు పోసుకున్న మహిళలు వీడుకోలు తవాఫ్ చేయకుండానే మక్కా వదిలి వెళ్ళవచ్చు.

    గమనిక: అత్తహలుల్ అస్గర్ తరువాత హజ్ యాత్రికునిపై ఉన్న నిషేధాజ్ఞలన్నీ తొలగిపోతాయి – భార్యాభర్తల సంభోగం తప్ప. అత్తహలుల్ అక్బర్ తరువాత భార్యాభర్తల సంభోగంతో పాటు హజ్ యాత్రికునిపై ఉన్న ఇహ్రాం స్థితి నిషేధాజ్ఞలన్నీ పూర్తిగా తొలగిపోతాయి.

    గుర్తుంచుకోండి! హజ్ దినాలు దుఆ చేయవలసిన, ఖుర్ఆన్ పఠించవలసిన మరియు అల్లాహ్ వైపు ఆహ్వానించవలసిన దినాలు. కాబట్టి మంచి పనులలోనే మీ సమయాన్ని వెచ్చించండి. మీకు నష్టం కలిగించే వ్యర్ధమైన విషయాల నుండి దూరంగా ఉండండి. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు “హజ్ నెలలు అందరికీ తెలిసినవే. వాటిలో ఎవరైతే హజ్ చేయుటకు తలపెడతారో, వారు హజ్ సమయంలో (భార్యలతో) లైంగిక కలాపాలకు, పాపపు పనులకు, జగడాలకు దూరంగా ఉండండి.” 2:197