హజ్జ్ అంటే ఏమిటి?
కూర్పులు
మూలాలు
Full Description
హజ్జ్ అంటే ఏమిటి?
అల్హందులిల్లాహ్ – సకల ప్రశంసలు అల్లాహ్ కే.
హజ్జ్ అంటే అల్లాహ్ యొక్క “పవిత్ర గృహమైన కాబాను సందర్శించే ఉద్దేశ్యంతో, హజ్జ్ ఆరాధనలు (మనాసిక్ లను) అంటే ‘ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన హజ్జ్ లో నమోదు చేయబడిన తవాఫ్ (కాబాగృహం చుట్టూ 7సార్లు తిరగటం) చేయటం, సయీ చేయటం (సఫా మరియు మర్వా గుట్టల మధ్య 7 సార్లు పరుగెట్టటం తీయటం), అరఫాహ్ మైదానంలో నిలుచోవటం, మీనాలోని జమరాత్ పై (షైతాన్ ను సూచించే రాతి స్థంభాలపై) రాళ్ళు విసరటం’ మొదలైన ఆదేశాలు మరియు ఆచరణలను అమలు చేసే ఉద్దేశ్యంతో ప్రయాణించటం.”
హజ్జ్ యాత్ర బ్రహ్మాండమైన లాభాలను, ప్రయోజనాలను ప్రజలకు అందజేస్తుంది. అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని బహిరంగంగా ప్రకటించటం వలన హజ్జ్ యాత్రికులకు మన్నింపు, క్షమాపణ ప్రసాదింపబడును. ఇంకా వేర్వేరు దేశాలలోని ముస్లింలు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవటానికి మరియు పరస్పరం ఇస్లాం ధర్మ నియమనిబంధనలు నేర్చుకోవటానికి అవకాశం లభిస్తున్నది. మీరు వయస్సులో చాలా చిన్నవారైనప్పటికీ మరియు కెనడా వంటి ముస్లిమేతర దేశంలో నివసిస్తున్నప్పటికీ హజ్జ్ గురించి కుతూహంగా అడిగి తెలుసుకుంటున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మీకూ హజ్జ్ చేసే మరియు హజ్జ్ యాత్రలోని ఆరాధనలన్నింటినీ ఆచరించే భాగ్యం కలుగజేయాలని అల్లాహ్ ను ప్రార్థిస్తున్నాము మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అపరిమితమైన అనుగ్రహాలను అల్లాహ్ కురిపించుగాక!
Islam Q&A
షేఖ్ ముహమ్మద్ సాలిహ్ అల్ మునజ్జిద్.