నమాజులోని అర్కాన్, వాజిబ్ మరియు సున్నహ్ భాగాలు
కూర్పులు
Full Description
నమాజులోని
అర్కాన్, వాజిబ్ & సున్నహ్ భాగాలు
﴿ أركان الصلاة واجباتها وسننها ﴾
] తెలుగు – Telugu – التلغو [
الشيخ محمد صالح المنجد
అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విమర్శ : షేఖ్ నజీర్ అహ్మద్
2009 - 1430
﴿ أركان الصلاة واجباتها وسننها ﴾
« باللغة التلغو »
الشيخ محمد صالح المنجد
ترجمة: محمد كريم الله
مراجعة: شيخ نزير أحمد
2009 - 1430
నమాజులోని మూలస్థంభాలు (రుకున్), తప్పని సరి భాగాలు (వాజిబ్) మరియు ఉత్తమ ఆచరణల (సున్నహ్) ల మధ్య నున్న భేదం ఏమిటి?
అల్హందులిల్లాహ్ – సకల స్తోత్రములు అల్లాహ్ కే,
నమాజులోని మూలస్థంభాలు (రుకున్) మరియు తప్పని సరి భాగాలు (వాజిబ్) ల మధ్య నున్న భేదం ఏమిటంటే – మూలస్థంభం (రుకున్) భాగాలను కావాలని గాని, పొరపాటు వలన గాని, అజ్ఞానం వలన గాని, ఇంకే కారణమైనా సరే వీటిని అస్సలు వదిలివేయటానికి వీలులేదు – అంటే ఎట్టి పరిస్థితులలోను వీటిని ఆచరించవలసినదే.
తప్పనిసరి (వాజిబ్) భాగాలను పొరపాటు వలన గాని, మర్చిపోవటం వలన గాని వీటిని వదిలివేసినా పర్వాలేదు. అయితే, సుజూద్ అస్సహూ (అంటే మర్చిపోయన కారణంగా చేసే అదనపు సజ్దాలు) ద్వారా దీని పరిహారం పూర్తిచేయ వచ్చును.
నమాజులో 14 మూలస్థంభాలు (రుకున్) మరియు 8 తప్పనిసరి భాగాలు (వాజిబాత్) ఉన్నాయి. అవి క్షుణ్ణంగా క్రింద వివరించబడినాయి.
నమాజులో అనేక సున్నహ్ లు (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తమ పద్ధతులు) పలుకులలోను మరియు ఆచరణలలోను ఉన్నాయి. సున్నహ్ అంటే నమాజులోని మూలస్థంభాలు (రుకున్), తప్పనిసరి భాగాలు (వాజిబ్) లు కాకుండా ఇంకా మిగిలిన విషయాలు.
కొందరు పండితులు నమాజులో 17 పలుకుల సున్నహ్ లు మరియు 55 ఆచరణల సున్నహ్ లు ఉన్నాయని తెలిపారు. వీటిని ఆచరించకపోవటం వలన నమాజు భగ్నం కాదు. మూలస్థంభాలు (రుకున్) లేదా తప్పనిసరి (వాజిబ్) భాగాల వలే కాకుండా, కావాలని ఏదైనా సున్నహ్ ను వదిలివేసినా సరే, నమాజు మాత్రం పూర్తవుతుంది.
అలాగే నమాజులోని మూలస్థంభాల (రుకున్) మరియు తప్పనిసరి (వాజిబ్) భాగాల మధ్య వ్యత్యాసం ఏమిటంటే, కావాలని అయినా లేక అజ్ఞానంతో అయినా, మూలస్థంభాన్ని ఎట్టి పరిస్థితులలోను వదిలివేయటానికి వీలు లేదు. కాని తప్పనిసరి (వాజిబ్) భాగాలు మాత్రం మరచిపోవటం వలన వదిలిపెట్టబడినా ఏమీకాదు. అయితే సహూ సజ్దా చేయటం ద్వారా పరిహారం చెల్లించుకోవచ్చును.
హంబలి పండితులలో ప్రసిద్ధిచెంది 'దలీల్ అల్ తాలిబ్' అనే పుస్తకం నుండి గ్రహించిన నమాజులోని మూలస్థంభ (రుకున్) భాగాలు, తప్పనిసరి భాగాలు (వాజిబ్) మరియు సున్నహ్ లు వరుసగా క్రింద తెలియజేయబడినవి.
1 – నమాజు మూలస్థంభ (రుకున్) భాగాలు – 14, అవి ఏవిటంటే:
(i) తప్పని సరి నమాజు అంటే ఫరజ్ నమాజు సాధ్యమైనతే నిలబడి ఆచరించటం.
(ii) తొలి తక్బీర్ అంటే నమాజు ప్రారంభంలో “అల్లాహ్ అక్బర్" అని పలకటం.
(iii) సూరహ్ అల్ ఫాతిహా పఠించటం.
(iv) రుకూ (వంగటం), పూర్తిగా వంగటం అంటే తమ నడుమును లెవెల్ గా సమానంగా ఉంచి, తలను దానికి సమాంతరంగా ఉంచవలెను. కాని ఏదేని కారణం వలన అలా చేయలేని పక్షంలో కనీసం తమ చేతులు మోకాళ్ళను స్పర్శించేలా అయినా నడుమును ముందుకు వంచవలెను.
(v) రుకూ (వంగటం) నుండి పైకి లేవటం.
(vi) తిన్నగా నిలుచోవటం.
(vii) సుజూద్ (సాష్టాంగం), అత్యంత సరైన విధానం ఏదంటే –నుదురు, ముక్కు, అరచేతులు, మోకాళ్ళు మరియు కాలి బొటన వ్రేళ్ళు నేలను పూర్తిగా తాకవలెను. కాని ఏదైనా కారణం వలన అలా చేయలేకపోతే, పై ప్రతి అవయవంలోని భాగాన్నైనా కనీసం నేలను తాకేలా చేయవలెను.
(viii) సజ్దా (సాష్టాంగం) నుండి పైకి లేవటం.
(ix) రెండు సజ్దాల (సాష్టాంగాల) మధ్య కూర్చోవటం. ఎలా కూర్చున్నా పర్వాలేదు అయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చున్న విధానం ఏమిటంటే – ఎడమ కాలిపై కూర్చుని, కుడి కాలు బొటన వ్రేలు ఖిబ్లా దిశలో ఉండేటట్లు చేసి, దానిని నిలబెట్టటం – ఈ కూర్చునే భంగిమను ముఫ్తారిషా అంటారు.
(x) ఈ భౌతిక మూలస్థంభాలను ప్రశాంతంగా ఆచరించటం.
(xi) చివరి తషహ్హుద్ (అత్తహయ్యాతు లిల్లాహి.......) పఠించటం.
(xii) చివరి తషహ్హుద్ పఠించటానికి మరియు రెండు సలాములు చేయటం కొరకు కూర్చోవటం.
(xiii) రెండు సలాము అంటే, “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ (మీపై అల్లాహ్ యొక్క శాంతి కలుగుగాక మరియు అల్లాహ్ యొక్క కరుణ కురుయుగాక)." నఫిల్ (ఐచ్ఛిక) నమాజులలో ఒక సలాము చేస్తే చాలు; జనాజహ్ నమాజు కూడా ఒక సలాము చేస్తే చాలు.
(xiv) పై తెలిపిన క్రమంలో మూలస్థంభాలను ఆచరించటం. ఎవరైనా కావాలని, రుకూ (వంగటం) కంటే ముందు సజ్దా (సాష్టాంగం) చేయటం వంటివి నమాజు తిరస్కరింప బడేటట్లు చేస్తాయి; కాని, ఒకవేళ పొరపాటున అలా చేసినట్లయితే, వెనుకకు మరలి ముందుగా రుకూ (వంగటం) మరియు ఆ తర్వాత సజ్దా (సాష్టాంగం) చేయవలెను.
2 – నమాజులోని తప్పనిసరి (వాజిబ్) భాగాలు. క్రింద తెలిపినట్లుగా ఇవి ఎనిమిది ఉన్నాయి:
(i) తొలి తక్బీర్ (అల్లాహ్ అక్బర్ అని పలకటం) కాకుండా మిగిలిన తక్బీరులు.
(ii) “సమిఅ అల్లాహు లిమన్ హమిదహ్ (తనను స్తుతించేవారి నుండి అల్లాహ్ వింటాడు)" అని పలకటం – ఇమాం మరియు ఒంటరిగా నమాజు చేసుకుంటున్న వారు మాత్రమే ఇలా పలకవలెను.
(iii) “రబ్బనా వ లకల్ హమ్ద్(మా ప్రభూ,సర్వస్తోత్రములు నీకే చెందును)" అని పలకటం
(iv) “సుభహాన రబ్బియల్ అజీమ్ (సర్వలోక శక్తిమంతుడైన, పరమ పవిత్రుడైన నా ప్రభువు కే నా కీర్తనలు)" అని రుకూ లో (వంగి నప్పుడు) ఒకసారి పలకటం
(v) “సుభహాన రబ్బియల్ ఆలా (సర్వలోక శక్తిమంతుడైన, పరమ పవిత్రుడైన నా ప్రభువే అత్యున్నతుడు)" అని సజ్దా (సాష్టాంగం)లో పలకటం.
(vi) “రబ్బిగ్ ఫిర్లీ (నా ప్రభూ నన్ను క్షమించు)" అని రెండు సజ్దాల మధ్య వ్యవధిలో కొంచెం సేపు కూర్చున్నప్పుడు పలకటం.
(vii) మొదటి తషహ్హుద్ (అత్తహయ్యాతు) పఠించటం.
(viii) మొదటి తషహ్హుద్ (అత్తహయ్యాతు) పఠించటం కోసం కూర్చోవటం.
3 – నమాజులోని సున్నహ్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలికిన) పలుకులు. అవి క్రింద తెలిపిన విధంగా 11 ఉన్నాయి :
(i) తొలి తక్బీర్ తర్వాత, “సుభహానక అల్లాహుమ్మ వ బి హమ్దిక, వ తబారక ఇస్ముక, వ తఆల జద్దుక వ లా ఇలాహ గైరుక (ప్రశంసలు మరియు కీర్తనలు నీకే, ఓ అల్లాహ్; నీ నామం శుభమైనది, నీ స్థానం అత్యున్నత మైనది మరియు నీవు తప్ప వేరే ఆరాధ్యుడెవ్వరూ లేరు)."దీనిని దుఆ అల్ ఇస్తిఫ్తాహ్ అంటే ఆరంభపు ప్రార్థన అంటారు.
(ii) అల్లాహ్ ను శరణు వేడుకోవటం (అవూదు బిల్లాహి మినష్షైతా నిర్రజీమ్ అని పలకటం)
(iii) బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం అని పలకటం.
(iv) అమీన్ అని పలకటం
(v) సూరహ్ ఫాతిరహా పఠించిన తర్వాత వేరే సూరహ్ పఠించటం.
(vi) ఇమాంగా నమాజు చదివిస్తున్నప్పుడు బిగ్గరగా పఠించటం.
(vii) ఇమాం వెనుక నమాజు చేస్తున్నప్పుడు తహ్మీద్ (రబ్బనాలకల్ హమ్ద్)) పలకటం, ఒంటరిగా నమాజు చేస్తున్నప్పుడు: “మిలఅ స్సమావాతి వ మిలఅ అల్ అర్ద్ వ మిలఅ మా షింత మిన్ షైయిన్ బఆద్ (ఆకాశాలను నింపిన మరియు భూమిని నింపిన మరియు నీవు తలిచిన వాటన్నంటినీ నింపిన)." (సామూహికంగా ఇమాం వెనుక నమాజు చేసేటప్పుడు కూడా ఇలా పలకటం సున్నహ్ అనేది సరైన అభిప్రాయం.)
(viii) రుకూ లో (వంగినపుడు) ఒకటి కంటే ఎక్కువ సార్లు తస్బీహ్ పలకటం.
(ix) సజ్దా (సాష్టాంగం)లో ఒకటి కంటే ఎక్కువ సార్లు తల్బీహ్ పలకటం.
(x) “రబ్బిగ్ ఫిర్లీ (ఓ నా ప్రభూ, నన్ను క్షమించు)" అని రెండు సజ్దాల మధ్య వ్యవధిలో కూర్చున్నప్పుడు ఒకటి కంటే ఎక్కువ సార్లు పలకటం.
(xi) చివరి తషహ్హుద్ (అత్తహయ్యాత్) లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయన కుటుంబం పై ప్రార్థనలు మరియు దీవెనలు పంపటం, ఆ తర్వాత దుఆ చేయటం (ప్రార్థించటం).
4 – నమాజులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించిన భంగిములు:
(i) తొలి తక్బీర్ పలుకుతున్నప్పుడు రెండు చేతులు పై లేవటం.
(ii) రుకూ (వంగటం) లో పోతున్నప్పుడు రెండు చేతులు పైకి లేపటం.
(iii) రుకూ (వంగటం0 నుండి పైకి లేచినప్పుడు రెండు చేతులు పైకి లేపటం.
(iv) ఆ తర్వాత ఆ చేతులను వదిలివేయటం.
(v) ఎడమ చేతిపై కుడి చేతిని పెట్టడం.
(vi) రుకూలో ఉన్నప్పుడు సజ్దా (సాష్టాంగ) స్థానంలో చూడటం.
(vii) నిలుచున్నప్పుడు, రెండు కాళ్ళు ఒకదానికొకటి కొంచెం దూరంగా ఉంచటం.
(viii) రుకూలో తమ చేతి వ్రేళ్ళను విస్తరింపజేసి, మోకాళ్ళను గట్టిగా పట్టుకోవటం, నడుమును సమంగా ఉంచి, తలను దానికి సమాంతరంగా ఉంచటం.
(ix) సజ్దా (సాష్టాంగం) చేస్తున్నప్పుడు తమ అవయవాలను భూమిపై గట్టిగా అదుముకుని ఉండేటట్లు ఉంచటం. రెండు మోకాళ్ళ మధ్య ఖాళీ ఉండేటట్లు చూడటం ఎందుకంటే మోకాళ్ళను బలంగా భూమిపై ఆన్చటం మక్రాహ్(అల్లాహ్ కు అయిష్టం).
(x) సజ్దాలో మోచేతులను తమ శరీరానికి దూరంగా, పొట్టను తమ తొడలకు దూరంగా, పిక్కలను తొడలకు అంటుకున్నట్లు ఉంచకుండా, రెండు మోకాళ్ళను కొంచెం దూరందూరంగా, పాదాలను నిలువుగా, బొటనవ్రేళ్ళ నేలపై నిలువుగా, చేతి వ్రేళ్ళను విస్తరింపజేసి, చేతులను భుజాలకు సరిసమానంగా ఉంచవలెను.
(xi) రెండు సజ్దాల మధ్య మరియు మొదటి తషహ్హుద్ పఠించే సమయంలో ముఫ్తారిషన్ భంగామలో కూర్చోవటం (ఎడమ కాలిపై కూర్చుని, కుడి కాలు బొటన వ్రేలు ఖిబ్లా దిశలో ఉండేటట్లు చేసి, దానిని నిలబెట్టటం మరియు రెండో తషహ్హుద్ లో కూర్చోవటం) మరియు చివరి తషహ్హుద్ పఠించే సమయంలో ముతవర్రిఖన్ అంటే ఎడమ కాలిపై కూర్చొని, కుడి కాలు పాదాన్ని రిలాక్స్ వెనుకకు వదిలివేయటం.
(xii) రెండు తొడలపై రెండు చేతులు ఉంచి, చేతి వ్రేళ్ళు దగ్గర దగ్గరగా ఉంచి, రెండు సజ్దాల మధ్య, తషహ్హుద్ పఠించే సమయంలో కూర్చోవలెను. కాని, అల్లహ్ ను ధ్యానించేటప్పుడు మాత్రం, కుడిచేతి బొటన వేలు, మధ్య వేలు కలిపి రింగులా చేసి, చూపుడు వేలును నిట్టనిలువుగా పైకి చూపవలెను.
(xiii) కుడి ప్రక్కకు మరియు ఎడమ ప్రక్కకు తరిగి సలాము చెప్పటం.
పైన తెలిపిన వాటిలో కొన్నింటిపై ధర్మశాస్త్ర పండితుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి; కొందరి దృష్టిలో పై న పేర్కొన్న కొన్ని ఆచరణలు (వాజిబ్) తప్పని సరి అయితే మరికొందరి దృష్టిలో అవి సున్నహ్ గా పరిగణింపబడినవి. ఇస్లామీయ ధర్మశాస్త్ర ఫిఖ్ గ్రంథాలలో ఈ విషయాలు క్షుణ్ణంగా వివరింపబడెను. అల్లాహ్ మాత్రమే సర్వజ్ఞుడు.
Islam Q&A